ఏలూరు జిల్లాలో భారీ పెన్షన్ పంపిణీ..!

ఏలూరు జిల్లాలో భారీ పెన్షన్ పంపిణీ..!

ఒక్కరోజే రూ.113 కోట్ల విడుదలకు ఏర్పాట్లు

ఏలూరు, ఆంధ్ర‌ప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జూన్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జిల్లాలో ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.

జూన్ 2026 నెలకు సంబంధించి ఏలూరు జిల్లాలో మొత్తం 2,55,816 మంది పెన్షన్ దారులకు రూ.113.29 కోట్లను పంపిణీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. పెన్షన్లు 1వ తేదీన 100 శాతం పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనివార్య కారణాలతో 1వ తేదీన పెన్షన్ పొందలేని వారికి 2వ తేదీన పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 4,959 మంది సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.

పెన్షన్ దారులు తమ ఇళ్లలోనే అందుబాటులో ఉండేలా ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, సచివాలయ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే పంపిణీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మిని కలెక్టర్ ఆదేశించారు.


Leave a Reply