Drugs | డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలి….

Drugs | డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలి….

  • 510 కిలోమీటర్ల డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర ..
  • డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం 112 లేదా 1972కు కాల్ చేయండి…..
  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు…
  • డ్రోన్లు, 12,000 సీసీ కెమెరాలు, న్యాట్‌గ్రిడ్ డేటాబేస్ ద్వారా నగరంపై ఉక్కుపాదం….
  • నగర సీపీ రాజశేఖర్ బాబు.

Drugs | పాయకాపురం, ఆంధ్రప్రభ : డ్రగ్స్ వ్యతిరేకపై ప్రభుత్వం ఉద్యమం మొదలు పెట్టింది. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ అధికారులు పిలుపునిచ్చారు. సుమారు 510 కిలోమీటర్ల డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంపై ప్రభుత్వ అధికారులు సైకిల్ యాత్ర నిర్వహించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం 112 లేదా 1972కు కాల్ చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు పిలుపునిచ్చారు.ఇందుకుగాను డ్రోన్లు, 12,000 సీసీ కెమెరాలు, న్యాట్‌గ్రిడ్ డేటాబేస్ ద్వారా నగరంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు
నగర సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం బి. ఆర్. టి. ఎస్. రోడ్డులో శారదా కళాశాల జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు ఆరోగ్యమైన సమాజం కావాలి అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 510 కిలోమీటర్ల డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర ఎనిమిదవ రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు,నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కలసి సైకిల్ యాత్రలో పాల్గొని, ప్రజల్లో డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.

Drugs |

ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల పరిపాలనలో రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని, ఏ రోడ్డుపై వెళ్లినా, ఏ మహిళా కేంద్రానికి వెళ్లినా గంజాయి ప్రభావం స్పష్టంగా కనిపించేదని, నేషనల్ ప్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం 2019–2024 మధ్యకాలంలో భారతదేశంలో గంజాయి వినియోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, దీని కారణంగా రాష్ట్రం దేశవ్యాప్తంగా క్రైమ్ రికార్డుల్లోకి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం, స్పష్టమైన ఆదేశాలు సమర్థవంతమైన పోలీస్ యంత్రాంగం, నిబద్ధత కలిగిన అధికారుల కృషితో నేడు పరిస్థితి పూర్తిగా మారిందని, గంజాయి నియంత్రణపై తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో క్రైమ్ రేటు దాదాపు 70 శాతం వరకు తగ్గడం ఒక చారిత్రాత్మక విజయం అని అన్నారు.