Doubt | తల్లిని చంపిన కొడుకు

Doubt | తల్లిని చంపిన కొడుకు
Doubt | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కర్ణాటకలోని మైసూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి కన్నతల్లినే హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మదహళ్లి గ్రామానికి చెందిన సుధ (48)కు మరో వ్యక్తితో సంబంధం ఉందని ఆమె కుమారుడు శివరుద్రప్ప (30) అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సుధను ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి బయటకు తీసుకెళ్లి, దారిలో ఆమె తలపై రాయితో దాడి చేసి హత్య చేశాడు.
హత్య అనంతరం సాక్ష్యాలను చెరిపివేయడానికి బంధువులైన ఆకాష్, అభిలాష్ సహాయంతో మృతదేహాన్ని తగలబెట్టినట్లు విచారణలో తేలింది. కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
