34వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ..

సంగారెడ్డి, ఆంధ్రప్రభ : పట్టణంలోని 34వ వార్డులో కౌన్సిలర్ సమ్రీన్ బేగం ఆధ్వర్యంలో శనివారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అన్వర్ భాయ్ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు. అన్వర్ భాయ్ ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారని స్థానికులు కొనియాడారు. అలాగే కార్యక్రమం విజయవంతం కావడంలో కౌన్సిలర్ సమ్రీన్ బేగం చేసిన కృషి, సమన్వయం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, వలంటీర్లు, మద్దతుదారులు పాల్గొన్నారు.
