ఘనంగా మాధవ్ జన్మదిన వేడుకలు..
- ఆటో కార్మికులు, రోజువారీ కూలీలు, పేదలకు వస్త్రాలు, పండ్ల పంపిణీ
(విజయవాడ, ఆంధ్రప్రభ) ; బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ జన్మదిన వేడుకలను విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదలలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంతో పాటు రాష్ట్రంలో బీజేపీ అధికార భాగస్వామిగా ఉన్నందున అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పి.వి.ఎన్. మాధవ్ సారథ్యంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమ నిర్వాహకులు, బీజేపీ నాయకులు, న్యాయవాది డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ అంత్యోదయ స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. మాధవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తూర్పు నియోజకవర్గానికి చెందిన వందలాది మంది బీఎంఎస్ ఆటోస్టాండ్ కార్మికులు, రోజువారీ కూలీలు, పేదలకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా సచివాలయ కార్యాలయ కార్యదర్శి మాధవి కంభంపాటి, అధికార ప్రతినిధి జగర్లమూడి గాయత్రి, సీనియర్ నాయకులు దాసరి రవికుమార్, గోగినేని రాజేంద్రప్రసాద్, ఎన్.పవన్‌కుమార్, లావణ్య, తులసి, పసుమర్తి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
