AP | రెండు ఎద్దులను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు..

AP | రెండు ఎద్దులను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు..

వీఎంసీ సహకారంతో డ్రెయినేజీ నుంచి సురక్షితంగా వెలికితీత

AP | సత్యనారాయణపురం, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలోని బీఆర్‌టీఎస్ ఫుడ్ జంక్షన్ సమీపంలోని సన్నని డ్రెయినేజీలో ప్రమాదవశాత్తు రెండు ఎద్దులు పడిపోయి చిక్కుకుపోయాయి. సమాచారం అందిన వెంటనే త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులకు సమాచారం అందించారు. వీఎంసీ అధికారుల సమన్వయంతో సంఘటనా స్థలానికి క్రేన్‌ను తరలించి, సంబంధిత శాఖల సంయుక్త ప్రయత్నాలతో డ్రెయినేజీలో చిక్కుకున్న రెండు ఎద్దులను ఎటువంటి గాయాలు కలగకుండా సురక్షితంగా బయటకు తీసివేశారు. ఈ సహాయక చర్యల్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. కిషోర్ బాబు, ఆర్‌ఎస్‌ఐ జి.వి.ఎన్. కుమార్, రైటర్ అజార్ పీసీ రాజేష్, హెచ్‌సీ కిషోర్, పీసీ సుబ్రహ్మణ్యం, పీసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఎంసీ వెటర్నరీ అధికారులు, సహకరించిన సిబ్బందికి ట్రాఫిక్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.