Ongole | దూసుకొస్తున్న దిత్వా తుఫాన్

Ongole | దూసుకొస్తున్న దిత్వా తుఫాన్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole | ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ వాయుగుండం మారడంతో ఈ రోజు, రేపు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ (Collector) పి. రాజాబాబు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 08592-281400 నంబర్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.
ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే సంప్రదించవచ్చన్నారు. జిల్లా అత్యవసర ఆపరేషన్ (Operation) కేంద్రం టోల్-ఫ్రీ నంబర్ 1077లోనూ సంప్రదించవచ్చన్నారు. ఈ కంట్రోల్ రూంలో సంబంధిత శాఖల సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఆర్డీఓ కార్యాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
