సీఎం చంద్రబాబుతో ఏపీటీడీసీ డైరెక్టర్‌ రమేష్‌ నాయుడు భేటీ

విజయవాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డైరెక్టర్‌ కిల్లి వెంకట రమేష్‌ నాయుడు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో రమేష్‌ నాయుడు పుష్పగుచ్ఛం అందజేసి చంద్రబాబును అభివాదం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, ఏపీటీడీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు రమేష్‌ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను మరింతగా వినియోగించుకుని, పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు