గవర్నర్‌ను కలిసిన ఫైనాన్స్ కమిషన్ సభ్యులు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఇటీవల నియామకం జరిగిన తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సభ్యులు కాకి రంగరాజ్ సుధీర్ రెడ్డి హుస్సేనలీ లతోపాటు ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి కాన్త్యాయనీదేవితెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రతాప్ శుక్ల ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్తో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు పలు విషయాలను చర్చించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పలువురు సభ్యులు ఫైనాన్స్ కమిషన్లో ఉండడం ద్వారా పలు విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
