1 Dead 5 Injured Us Airstrikes : అమెరికా ప్రతిదాడి Andhra Prabha News

1 Dead 5 Injured Us Airstrikes : అమెరికా ప్రతిదాడి Andhra Prabha News
- ఒకరు మృతి…
- ఐదుగురికి గాయాలు
- ఇరాన్‌లో కీలక కేంద్రాలపై దాడులు
- ఖుజెస్తాన్ పెట్రోకెమికల్ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం
- మహ్‌షహర్ ప్లాంట్లపై వైమానిక దాడులు
- బుషెహర్ అణు కేంద్రంపై మరోసారి దాడి
- అణు కేంద్రంలో భద్రతా అధికారికి మృతి
- రేడియేషన్ లీకేజీ లేదని అంతర్జాతీయ సంస్థ స్పష్టం
( ఆంధ్రప్రభ, టెహ్రన్ ప్రతినిధి)

యుద్ధం వద్దు మొర్రో…. రాజీకి రండి అని అమెరికా ఎంత మొత్తుకొంటున్నా.. ఇరాన్ అసలు తగ్టటం లేదు. ఇక సహించలేని స్థితిలో తమ ఆపరేషన్ ఎఫిక్ ప్యూరీకి అమెరికా, ఇజ్రాయెల్ పదుపు పెట్టాయి. దక్షిణ ఇరాన్ ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని పెట్రోకెమికల్ ప్లాంట్లు, బుషెహర్ అణు కేంద్రంపై శనివారం ఉదయం విరుచుకుపడ్డాయి. : మహ్‌షహర్ స్పెషల్ పెట్రోకెమికల్ జోన్‌లోని ఫజ్ర్ 1 , 2 (Fajr), రెజాల్ (Rejal), అమీర్ కబీర్ (Amir Kabir) పెట్రోకెమికల్ ప్లాంట్లపై వైమానిక దాడులు జరిపాయి. దక్షిణ ఇరాన్‌లోని ఖుజెస్తాన్ బుషెహర్ ప్రాంతాలపై శనివారం తెల్లవారుజామున దాడులు జరిగాయి. భారత కాలమానం (IST) ప్రకారం ఉదయం 7:30 AM నుండి 8:15 AM మధ్య ఈ వైమానిక దాడులు , క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బందర్ ఇమామ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. ఖోర్రంషహర్ కౌంటీలోని షలామ్చె (Shalamcheh) సరిహద్దు వాణిజ్య టెర్మినల్‌పై కూడా దాడి జరిగి భారీ నష్టం వాటిల్లింది.
1 Dead 5 Injured Us Airstrikes : బుషెహర్ లో ఒకరు మృతి

బుషెహర్ అణు కేంద్రంపై దాడి (Bushehr Nuclear Plant) ఇరాన్ ఏకైక కార్యాచరణ అణు విద్యుత్ కేంద్రం బుషెహర్‌పై శనివారం ఉదయం మరోసారి దాడి జరిగింది: ఈ దాడిలో ఒక భద్రతా అధికారి (Security Guard) మరణించినట్లు ఇరాన్ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. క్షిపణి దాడితో ప్లాంట్‌లోని ఒక అడ్మినిస్ట్రేటివ్ , లాజిస్టికల్ భవనం దెబ్బతింది. ప్రధాన రియాక్టర్ లేదా ఇతర కీలక విభాగాలకు ఎటువంటి నష్టం జరగలేదని, రేడియేషన్ లీకేజీ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా, ప్లాంట్‌లో పనిచేస్తున్న 163 మంది రష్యన్ సిబ్బందిని సాంకేతిక నిపుణులను రష్యాకు తరలించారు.
1 Dead 5 Injured Us Airstrikes : ఇది అమెరికా ప్రతి దాడే

ఇరాన్ ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ మౌలిక సదుపాయాలను “నాశనం చేయడం” ఇంకా పూర్తి కాలేదని హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ తన క్షిపణి డ్రోన్ దాడులను అమెరికా/ఇజ్రాయెల్ స్థావరాలపై ముమ్మరం చేసింది.
ఇరాన్ 2 అమెరికా యుద్ధ విమానాలను కూల్చినందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయి. న F-15E , A-10 అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేసింది. ఇది అమెరికాకు పెద్ద దెబ్బ. తమ విమానాలను కూల్చివేసినందుకు ప్రతిచర్యగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశించారు. ఇరాన్ ఆర్థిక వెన్నెముక అయిన పెట్రోకెమికల్ ప్లాంట్లను (ఖుజెస్తాన్), వ్యూహాత్మక అణు కేంద్రాలను (బుషెహర్) దెబ్బతీసి రాన్‌ను లొంగదీసుకోవాలని అమెరికా భావిస్తోంది.
