మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలు..

మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలు..

కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు ప్రధాన సెంటర్లో ఎం.వి.కృష్ణారావు విగ్రహానికి పూలమాలవేసి జరుగువానిపాలెం జనసైనికుడు జరుగు కిరణ్ బాబు( మెకానిక్), బడే వెంకటేశ్వరావు నివాళులర్పించారు. దివిసీమ గాంధీ మాజీ ఉమ్మడి రాష్ట్ర మంత్రి నిరాడంబరుడు మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు నిర్విరామంగా రాష్ట్రం మొత్తం నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కిరణ్ బాబు మాట్లాడుతూ మండల వెంకట కృష్ణారావు దివిసీమ ప్రాంతానికి ఎంతో మేలు చేశారని దివిసీమ ప్రాంతంలో దాదాపుగా 5 వేల ఎకరాలు బీడు భూములు సాగు భూములుగా చేశారని అన్నారు. దివిసీమ ప్రాంతంలో దిగున ఉన్న మా ఊరు జరుగువానిపాలెం గ్రామానికి ఎంతో మేలు చేశారని మా పెద్దలు ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటే చాలా గర్వంగా ఉండేదని ఈ సందర్భంగా కిరణ్ బాబు అన్నారు.

మండలి కుటుంబం అంటే మాకు ఎనలేని అభిమానం అని, అంతేకాకుండా రాజకీయాలకు అతీతంగా కృష్ణారావు గారి తనయులు స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ దివిసీమ అభివృద్ధికి అహర్నిశల శ్రమిస్తున్నారని అన్నారు, యువ నాయకులు మండలి వెంకట్రామ్ ( రాజబాబు ) వెంటే మా యువతరం ఉంటుందని అన్నారు, ఏ సమస్య వచ్చినా యువ నాయకులు వెంక ట్రామ్, తక్షణమే స్పందించి మాకు తోడుగా ఉంటున్నారని ఈ సందర్భంగా జనసేన యువ నాయకులు మెకానిక్ కిరణ్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు బడే గాంధీ, మాజీ కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు ముద్దినేని చందర్రావు, లింగారెడ్డి పాలెం పిఎసిఎస్ చైర్మన్ కోట సుబ్బారావు, అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త బడే భవనారాయణ, మందపాకల జనసేన సీనియర్ నాయకులు పరిశే వెంకటేశ్వరావు, కోడూరు పిఎసిఎస్ డైరెక్టర్ మల్లా వెంకటేశ్వరరావు, కోడూరు నీటిసంగాల వైస్ ప్రెసిడెంట్ బచ్చు పూర్ణచందర్రావు పెద్ది బాబురావు, దావు రాజబాబు, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply