CMRF | పేదలకు అండగా సీఎం సహాయనిధి

ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు
CMRF | జి. సిగడాం(శ్రీకాకుళం), నవంబర్ 17(ఆంధ్రప్రభభ) : వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయనిధిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. జి. సిగడాం మండలం బాతువలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుండి మంజూరైన చెక్కులను ఆయన నలుగురు లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు. మండలానికి చెందిన ఈ నలుగురికి కలిపి మొత్తం రూ.2,10,000 (రెండు లక్షల పది వేల రూపాయలు) విలువైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు.
ఈ కార్యక్రమంలో కుమారపు రవికుమార్, బాలబొమ్మ వెంకటేశ్వరరావు, బురాడ వెంకటరమణ, కుదిరేళ్ళ బుజ్జి, అర్జున్ భూపతి, డబ్బాడ కళ్యాణి, కూర్మారావు, ఆదినారాయణ, సర్పంచ్‌లు వెంకటరావు మాస్టర్, మహేష్, సాకేటి నాగరాజు, అప్పలనాయుడు, జ్ఞానేశ్వరరావు బంగారు నాయుడు, సూర్యనారాయణ, పడాల అప్పన్న మాస్టర్, మక్క నారాయణరావు సహా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
