CM Revanth | నాణ్యత ప్రమాణాలు పాటించాలి

CM Revanth | నాణ్యత ప్రమాణాలు పాటించాలి

  • రూ. 50 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Medaram | గ‌ణ‌పురం\భూపాల‌ప‌ల్లి జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అధికారులు, కాంట్రాక్టర్ లకు సూచించారు. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ – జంగాలపల్లి వరకు రూ. 25 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డుకు, భూపాలపల్లి మండలం కమలాపూర్ – నార్లపూర్ వరకు రూ. 25 కోట్లతో డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గండ్ర‌ మాట్లాడుతూ మేడారం జాతర(Medaram Jatara) దృష్ట్య ఇన్, ఔట్ రాకపోకలు అధికంగా ఉండే ఈ రెండు రహదారులు పూర్తిగా ధ్వంసమై ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది(Chief Minister Revanth Reddy) తో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. రోడ్డు పునః నిర్మాణం చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకార్యాలు కలగకుండా పనులు చేపడుతున్నామన్నారు.

ఈ కార్యక్రమం లో గణపురం తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో భాస్కర్ సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్(Repaka Rajender), నాయకులు మోటపోతుల శివశంకర్ గౌడ్, ఎర్రబెల్లి రామేశ్వర్ రావు, వడ్లకొండ నారాయణ గౌడ్, ముత్యాల రాజయ్య, కొత్త వెంకన్న, లక్కం రాములు,సూరినేని సంపత్ రావు, కటుకూరి శ్రీనివాస్,చోటే మియా,మాదం సుధాకర్,కాల్వ రాంరెడ్డి,జన్ను ఓదెలు,కస్తూరి కుమారస్వామి, వెంపటి భువన సుందర్ తోట వెంకట్ రెడ్డి పెంట చిరంజీవి, ఆర్టీఏ మెంబెర్ సుంకరి రామచంద్రయ్య, తోట సంతోష్, అంబాల శ్రీనివాస్, దాట్ల శ్రీనివాస్, పిప్పల రాజేందర్, తోట రంజిత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply