TEMPLE | భక్త మార్కెండేయ ఆలయంలో మహాన్నదానం

TEMPLE | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు శ్రీశివ పార్వతి సహిత భక్త మార్కెండేయ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు మధ్యాహ్నం మహాన్నదాన‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ బాధ్యులు కూరపాటి వెంకటేశ్వర్లు, గుండా రమణయ్య, వేముల శ్రీనివాస్, పాము రవీందర్, వేముల సుధాకర్ తోపాటు ఇతర కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు వేయి మంది భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.