సీఎం పర్యటనను పండగలా విజయవంతం చేయాలి..

కూటమి నేతల పిలుపు..
భారీగా తరలిరావాలని కార్యకర్తలకు సూచన


కలిదిండి, ఆగస్టు 8: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను కలిదిండిలో పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. కలిదిండి ఏఎంసీ మార్కెట్‌ యార్డులో శనివారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ (చంటి) తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కూటమి శ్రేణుల సమ్మేళనంతో కలిదిండి గడ్డ దద్దరిల్లేలా సీఎం చంద్రబాబు నాయుడికి అపూర్వ ఘన స్వాగతం పలకాలని నేతలు పిలుపునిచ్చారు.