CM | కప్ టార్చ్ ర్యాలీ
CM | ఎండపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు చేపట్టిన సీఎం కప్–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో శనివారం ఎండపల్లి మండల కేంద్రంలో రెండో విడత టార్చ్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో దొండ కృపాకర్, ఎంఈఓ సముద్రాల హరికృష్ణ మాట్లాడుతూ… గ్రామీణ క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే సీఎం కప్ ముఖ్య ఉద్దేశమని, క్రీడల ద్వారా యువతను శారీరకంగా, మానసికంగా బలోపేతం చేసి జాతీయ స్థాయిలో తెలంగాణను అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బాక్సింగ్ కోచ్ నవీన్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని టార్చ్ ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు.
