అన్నదాత భక్తులకు సన్మానం
సిద్ధిరామేశ్వర ఆలయంలో భక్తులకు అన్నదానం
శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు
దాతలను శాలువాలతో సత్కరించిన ఆలయ పునర్నిర్మాణ కమిటీ
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా పేరొందిన సిద్ధిరామేశ్వర ఆలయంలో శనివారం భక్తులు అన్నదానం నిర్వహించారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
మండల కేంద్రానికి చెందిన బండి నారాయణ, లక్ష్మీ కుటుంబ సభ్యులు భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు లింబాద్రి మాట్లాడుతూ శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దాతలు ముందుకు వచ్చి అన్నదానం ఏర్పాటు చేస్తే వారి పేరుతో ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు చీకోటి ప్రభాకర్, ఆలయ అర్చకుడు రాజేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.
