సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా

రేగొండ, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్‌ 44వ జన్మదిన వేడుకలను రేగొండ మండల కేంద్రంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ మండల నాయకుడు బింగి భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి ప్రశాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందగట్ల రాజు, బూర్గుల ప్రభాకర్, రావుల తిరుపతి, పసుల అశోక్, లెంకలపల్లి సంతోష్, జన్ను కిరణ్, పున్నం కరుణ్, యాసిన్ పాషా, ఉదయ్, శివ, దయ్యాల ఓంకార్‌తో పాటు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.