మహానందిలో భక్తుల సమస్యలు తీర్చండి…

మహానందిలో భక్తులు సమస్యలు తీర్చండి…

ఎగ్జిక్యూటివ్ అధికారులకు వినతి పత్రం..


నంద్యాల బ్యూరో, నవంబర్ 4 ఆంధ్రప్రభ : కార్తీకమాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున మహానంది (mahanandi) పుణ్యక్షేత్రానికి హాజరయ్యే భక్తుల సమస్యలను, కష్టాలను ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. నవనందులు పాదయాత్ర చేసే భక్తులకు ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్ దర్శనం ఏర్పాటు చేయాలన్నారు. నవనందులు పాదయాత్ర చేసిన భక్తులు మహానందికి వచ్చే సమయానికి కాళ్ల నొప్పులతో దెబ్బలతో బాధ అనుభవిస్తూ ఉంటారు. సాధారణ క్యూ లైన్ లో నిలబడి దైవదర్శనానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని కోరారు.

నవగ్రహాల వద్ద భక్తులను క్యూ లైన్ లో నిలబడకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఒత్తులు వెలిగించాలని బలవంతంగా దారి మూసివేయడం భక్తులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. కోటి దీపోత్సవం వద్ద మహిళలు కూర్చోవడానికి ప్రత్యేక మార్కింగ్ ఏర్పాటు చేసి పూజలు నిర్వహించాలని సూచించారు. ఆలయ గర్భగుడిలో ప్రత్యేక కార్యక్రమాలు నిలిపివేసి ప్రతి ఒక్కరికి సాధారణ దర్శనం వేగవంతంగా కల్పించాలని, కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. మహానంది క్షేత్రంలో వాహనాలను క్రమబద్ధీకరించాలన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు మురళి, ప్రసాద్ ,కాకర్ల శివ, రామచంద్రుడు, కాకర్ల రామకృష్ణ ,చందు, సుబ్బరాయుడు, మద్దిలేటి, పలువురు పాల్గొన్నారు.

Leave a Reply