గర్భవతులు, బాలింతలు బయటకు రావద్దండి

గర్భవతులు, బాలింతలు బయటకు రావద్దండి

రాప్తాడు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నందువలన వేడి గాలులు వీస్తున్నాయి అందువలన గర్భవతులు బాలింతలు పిల్లలు బయటకు రాకుండా చల్లని గాలి వెలుతురు ఎక్కువగా ఉన్నటువంటి ఇళ్లలో కానీ వరండా లో కానీ ఉండాలని డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మంజునాథ్ తెలియజేశారు. రాప్తాడు మండలంలోని 3వ అంగన్వాడీ కేంద్రం నందు కిషోర్ వికాసం వేసవి శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో డిసిపిఓ మంజునాథ్ మాట్లాడుతూ పిల్లలు గర్భవతులు బాలింతలు పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.మజ్జిగ మరియు నీరు తరచూ తాగుతూ ఉండాలి. ప్రతిరోజు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలియజేశారు.అలాగే ఇంటి చుట్టుపక్కల కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.గర్భవతులు బాలింతలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరం మేరకే బయటికి రావాలని అన్నారు.గర్భవతులు పిల్లలు బయట దొరికే జంక్ ఫుడ్స్ ను తీసుకోకూడదని తెలిపారు.అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో రూరల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉమా శంకరమ్మ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కో-ఆర్డినేటర్ కృష్ణమాచారి కేస్ వర్కర్స్ ఇర్ఫాన్ నిర్మల ఐసిడిఎస్ సూపర్వైజర్లు లీలావతి శ్రావణి మహిళా సంరక్షణ కార్యదర్శిలు మల్లేశ్వరి సరిత ఏఎన్ఎం రామాంజినమ్మ అంగన్వాడి టీచర్ లలితమ్మ సావిత్రి విజయలక్ష్మి లక్ష్మీదేవి ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply