ధర్మపురిలో మంత్రి అడ్లూరి ఇంటింటా ఎన్నికల ప్రచారం..

ధర్మపురిలో మంత్రి అడ్లూరి ఇంటింటా ఎన్నికల ప్రచారం..

ధర్మపురి(ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల ప్రచారం భాగంగా సోమవారం ధర్మపురి పట్టణంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో పటేల్ చౌరస్తా, తెనుగు గద్దె, బ్రాహ్మణ సంఘం, దేవాలయం, నంది చౌరస్తా, గాంధీ చౌరస్తా ఏరియాల్లో మంత్రి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వార్డుల్లోని సమస్యలను ప్రజలు మంత్రి తెలుపగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే దశల వారిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈనెల 11వ తేదినా జరిగే మున్సిపాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను భారీ మోజార్టీతో గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Leave a Reply