విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి
- ఎంపీడీవో సీతారామయ్య
శావల్యాపురం, ఆంధ్రప్రభ: ప్రాథమిక దశ నుండే విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని ఎంపీడీవో సీతారామయ్య అన్నారు. 80 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన శావల్యాపురం శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు మహాత్మా గాంధీ, నేతాజీ, భరతమాత, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, మదర్ థెరీసా, బిఆర్ అంబేద్కర్ తదితర సమరయోధుల వేషధారణ ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో సీతారామయ్య విద్యార్థులచే 2047 విజన్ ప్రమాణాన్ని చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని తమ ఇళ్లపై ఎగురవేసి దేశభక్తిని చాటాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం అనేది కుల, మత, వర్గాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మద్దికుంట సాంబశివరావు, పాఠశాల కరస్పాండెంట్ కె.వి.ఆర్ మోహన్ చంద్, ప్రిన్సిపాల్ రత్నకుమారి, తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
