కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రజక విద్యార్థి సంఘం నాయకుడు కొరపల్లి రాజేష్ డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని కోరారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పేద ప్రజలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను బలహీనపరిస్తే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ప్రతి కుటుంబానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
