మున్సిపల్ కార్మికులకు దుస్తుల అందజేత..

ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక నూతన దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు నూతన దుస్తులను అందజేసినట్లు పేర్కొన్నారు.

మున్సిపల్ సిబ్బంది తమ విధుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని సూచించారు. వార్డుల్లో పారిశుద్ధ పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముహమ్మద్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, తొడసాం ఇందిరా, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, నాయకులు ప్రకాష్ గౌడ్,మేష సతీష్,బొప్పరపు రాజ్ కుమార్,మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.