మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ
నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; గత పది రోజుల క్రితం మేడపల్లి గ్రామానికి చెందిన పైతరి చేరాలు మరణించగా, వారి కుటుంబానికి ఆదరణగా బీఆర్ఎస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో సహాయం అందించారు. నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం, సర్పంచ్ అర్రేమ్ సాంబయ్య 25 కిలోల బియ్యం, మాజీ సర్పంచ్ లావుడియా తిరుపతి 50 కిలోల బియ్యం అందజేశారు,సర్పంచ్ మాజీ సర్పంచ్ లు మాట్లాడుతూ,గ్రామంలో ఎవరికి ఇలాంటి కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.
మృతుని కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం అని వారు తెలిపారు,మానవత్వం కోణంలో ప్రతి ఒక్కరం ముందుకు రావాలి,ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబానికి ధైర్యం చెప్పడం మన బాధ్యత” అని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల రాధిక యాకయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు నడిగోట్టి వెంకన్న,ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు ఆవునూరి మురళి,మాజీ టీసీ తాళ్లపల్లి సుదర్శన్,సంధినేని యాదగిరి రావు,ఎర్రోజు బిక్షపతి,కొలిపాక రంజిత్,అర్రేమ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
