కాంగ్రెస్‌లోకి బిజెపి నాయకులు..

వర్ణి (ఆంధ్రప్రభ): వర్ణి మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూనిపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త శివతో పాటు నవీన్ రెడ్డి, సతీష్, దత్తు, మహేందర్ రెడ్డి, బాలు, ప్రవీణ్ గౌడ్, శేఖర్, గోవుర్ నరేష్ తదితరులు కాంగ్రెస్ కండువా కట్టుకున్నారు.
ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ అభ్యర్థి గిరి సాయులు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, వర్ణి మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
