Telangana | మొబైల్ ఫోన్ చోరీ కేసులో….!

Telangana | మొబైల్ ఫోన్ చోరీ కేసులో….!

విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బాల శంకర్ కృష్ణ రిమాండ్..!


Telangana | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : మొబైల్ ఫోన్ చోరీ కేసులో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ (SC/ST Vigilance Monitoring Committee) సభ్యుడు బాల శంకర్ కృష్ణ అరెస్టు అయ్యారు. గత ఏడాది అక్టోబర్ నెలలో బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సామల ప్రశాంత్ సెల్ ఫోన్ ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో చోరీకి గురైంది.

ఈ విషయంలో సీసీ ఫుటేజీల ఆధారంగా బాల శంకర్ కృష్ణ (Bala Shankar Krishna) తన ఫోన్ చోరీ చేసినట్టు ప్రశాంత్ ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో వారి మధ్య గొడవకు దారితీసింది. తీరా మొబైల్ ఫోన్ చోరీ చేసిన బాల శంకర్ కృష్ణ మెట్టుపల్లిలోని తన బంధువులకు పంపించగా, అక్కడ రెండు రోజుల క్రితం సిమ్ మార్చుతుండగా సైబర్ క్రైమ్ పోలీసుల(Cyber crime police) కు సమాచారం అందింది.

సామల ప్రశాంత్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ మొబైల్ ఫోన్ చోరీ కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించారు. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఇటీవలే నియామకమైన బాల శంకర్ కృష్ణ పదవి కోల్పోయే అవకాశం ఏర్పడింది.

Leave a Reply