Pedana | అందని సాయం..

Pedana | అందని సాయం..
Pedana, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను దాటికి పెడన నియోజకవర్గంలో వేల హెక్టార్లలో పంట దెబ్బ తినగా, వేలాది మంది రైతులు నష్టపోయారు. ఎకరానికి రూ.10 వేలు పరిహారానికి నవంబర్ లోనే జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ పూర్తి అయ్యింది. అయితే.. ప్రక్రియ పూర్తయి నెల దాటినా పరిహారం జమ కాకపోవడంతో అన్న దాతలు ఆవేదన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంట పోయి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని, అధికారులు స్పందించి వెంటనే పరిహారం విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
