కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి చిరపుంజి (అస్సాం)లో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
‘కరువు ప్రాంతంలో పుట్టిన నాకు 365 రోజులూ వర్షాలు కురిసే చిరపుంజిని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అన్ని కరవు ప్రాంతాలలో మంచి వర్షాలు పడాలని భగవంతుడి కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. అక్కడి విశేషాలను వివరించారు.