NZB | మంత్రి పదవి ఇవ్వడానికి ఇందూరు నేతలకు అర్హత లేదా ? : దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 9(ఆంధ్రప్రభ) : మంత్రి పదవి ఇవ్వడానికి ఇందూరు (Induru) నేతలకు అర్హత లేదా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion) లో నిజామాబాద్ జిల్లాకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది సాదా విషయమేం కాదన్నారు.

సోమవారం నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel Kulachari) మాట్లాడుతూ… నిజామాబాదు జిల్లాకు చెందిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కూడా గౌరవించని కాంగ్రెస్, తన పార్టీ నేతల పట్లే చులకన చూపుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి జిల్లాల ప్రాతినిధ్యం పట్ల పట్టుదల లేదన్నారు. ఇది నైతికంగా, ప్రజాస్వామ్య పరంగా బాధాకరమన్నారు. నిజామాబాద్ సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలి.. ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన తప్ప అభివృద్ధిపై శ్రద్ద లేదన్నారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ది చెప్పాలన్నారు. రాష్టంలో బీసీలకు మేమే పెద్దపీఠ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 56శాతం ఉన్నా బీసీలకు మీ మంత్రి వర్గంలో ఎంత మందికి పదవులు ఇచ్చారో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. బీసీల ఓట్లు కావాలి.. కానీ బీసీలకు పదువులు ఇవ్వరా అని అన్నారు. బీసీలను విస్మరించిన కాంగ్రెస్ (Congress) ను రాబోయే రోజుల్లో బొంద పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మినారాయణ, న్యాలం రాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ, ఇంటలెక్చువల్ కన్వీనర్ డా:కొండా ఆశన్న, రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు నాగరాజ్, ఓం సింగ్, నాయిడి రాజన్న, యాదల నరేష్, అమందు విజయ్ కృష్ణ, చిరంజీవి, సందీప్ పాల్గొన్నారు.

Leave a Reply