ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమం..
ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమం..
అచ్చంపేట, (ఆంధ్రప్రభ): అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, డూప్లికేట్ పేర్ల తొలగింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సంఘటన సృజన్ కోఆర్డినేటర్, ఎస్‌ఐఆర్ శిక్షణ కార్యక్రమాల ఇన్చార్జి రాచమల్ల సిద్దేశ్వర్ పాల్గొని ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా ప్రాముఖ్యతను వివరించారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించనున్నట్లు శిక్షణలో వెల్లడించారు. ప్రతి బూత్ స్థాయిలో బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా పనిచేయాలని నాయకులు సూచించారు.
ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించడమే ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు. బూత్ స్థాయిలో సమన్వయంతో పని చేసి డేటా సేకరణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
