విద్యుత్ సర్క్యూట్ తో గుడిసెలు దగ్ధం..

విద్యుత్ సర్క్యూట్ తో గుడిసెలు దగ్ధం..
- పిచ్చయ్య బావి తండాలో పూరి ఇండ్లు కాలిపోతున్న దృశ్యం
- మిర్చి అమ్మకంతో వచ్చిన డబ్బులు కూడా కాలిపోయాయి
వెల్దుర్తి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని పిచ్చయ్య బావి తండా గ్రామానికి చెందిన బాణావతు మంత్రు నాయక్ నివాసముండే పూరిగుడిసె విద్యుత్ సర్క్యూట్ తో కాలిపోయాయి .. తండాలోని గిరిజనులు ఉదయాన్నే మిర్చి కోతలకు వెళ్లిపోగా ఎవరు లేని సమయంలో ఒకేసారి బాణావతు మంత్రుల నాయక్ ఇంటి నుండి మంటలు ఎగిసి పడటంతో తండాలో ఉన్న గిరిజనులు భయభ్రాంతులకు గురయ్యారు. పొలము నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు పూర్తిగా దగ్ధం అయిపోయింది. కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇంటిలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ మధ్యనే మిర్చి అమ్మగా వచ్చిన డబ్బులు కూడా మంటల్లో కాలి బూడిద అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

