Anil Ravipudi | రెమ్యూనరేషన్ అంత డిమాండ్ చేస్తున్నాడా..?

Anil Ravipudi | రెమ్యూనరేషన్ అంత డిమాండ్ చేస్తున్నాడా..?
Anil Ravipudi | ఆంద్రప్రభ వెబ్ డెస్క్ : దర్శకుడు అనిల్ రావిపూడికి సంక్రాంతికి హిట్స్ ఇచ్చే దర్శకుడిగా పేరొచ్చింది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ అందించారు. తన ఫేవరేట్ హీరో వెంకటేష్ (Venkatesh) తో ఈ సినిమాలో వెంకీ గౌడ అనే గెస్ట్ రోల్ చేయించారు. ఇక వచ్చే సంక్రాంతికి కూడా అనిల్ ఓ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. రెమ్యూనరేషన్ బాగానే డిమాండ్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. అనిల్ రెమ్యూనరేషన్ ఎంత..? ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తున్నాడు..?
Anil Ravipudi | కథను ఫాస్ట్ గా రెడీ చేయడం..
కథ రెడీ అయిన తర్వాత అంతే ఫాస్ట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం.. ఇది అనిల్ రావిపూడి స్టైల్. పైగా ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటుంది. నిర్మాతకు భారీగా లాభాలు తీసుకువస్తుంది. అందుకనే ఇప్పుడు అనిల్ రావిపూడికి (Anil Ravipudi) బాగా డిమాండ్ పెరిగింది. కథ రెడీ అయితే ఆర్నెళ్లలో సినిమాను రిలీజ్ చేసే పక్కా ప్లాన్ తో వెళ్లే ఈ దర్శకుడికి మళ్లీ సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పెద్ద సమస్య కాకపోవచ్చు.

Anil Ravipudi | మన శంకరవరప్రసాద్ గారు తర్వాత
నెక్ట్స్ పొంగల్ కు అనిల్ చేయబోయే సినిమా విక్టరీ వెంకటేష్ తో అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పట్టాలెక్కితే ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు తర్వాత వీళ్ల కాంబోలో వచ్చే ఐదో చిత్రం అవుతుంది. గత నాలుగు సినిమాల్లో వెంకీని ఆయన ఇమేజ్ కు తగినట్లు చూపిస్తూ ఎంటర్ టైన్ చేసాడు అనిల్ రావిపూడి. ఐదో చిత్రం కూడా అలాంటి ఓ మంచి ఎంటర్ టైనర్ తో తెరకెక్కించాలని చూస్తున్నారట. ఇక వరుస సక్సెస్ లతో ఈ దర్శకుడు రెమ్యునరేషన్ (Remuneration) పెంచాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయన రెమ్యూనరేషన్ 25 కోట్లు అని ప్రచారంలో ఉంది. అయితే.. ఇప్పుడు 50 కోట్ల రూపాయలను ఆయన నెక్ట్స్ సినిమాకు ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ ఆఫర్ చేస్తున్నారట. ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై రూల్ ఉంటుంది కాబట్టి సూపర్ హిట్ సినిమాలు తీస్తున్న దర్శకుడిగా అనిల్ రావిపూడికి 50 కోట్ల రూపాయల ఫీజు ఇవ్వొచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. నెక్ట్స్ సంక్రాంతికి వచ్చే మూవీతో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తే.. ఇంకా పెంచేస్తారేమో. ఏది ఏమైనా అనిల్ రావిపూడి టైమ్ నడుస్తుంది.

CLICK HERE TO READ సందీప్ రెడ్డి సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు..?
