బాండేర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఖాళీల భర్తీ చేయాలి..

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని బాండేర్ పంచాయతీ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ ఆయా పోస్ట్ ఖాళీగా ఉందని ఆ పోస్టుల నియమించాలని గ్రామపంచాయతీ ద్వారా చేసిన తీర్మాన పత్రాన్ని శనివారం మండల కేంద్రంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లకు సర్పంచ్ కుమ్ర భీమ్రావు అందించారు. బాండేర్ అంగన్వాడి కేంద్రం పరిధిలో 500 పైగా జనాభా ఉందని మా పంచాయతీలో ఫోన్ సిగ్నల్ రాకపోవడం వల్ల చాలామంది పేర్లు ఆన్లైన్ చేయించలేకపోతున్నారని ఆయన ఇచ్చిన తీర్మాన పత్రంలో కోరారు.

బాండేర్ అంగన్వాడి కేంద్రానికి అంగన్వాడి టీచర్ ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో చిన్న పిల్లలకు పోస్టుగాహారం అందడం లేదని త్వరగా ఆ పోస్టులను భర్తీ చేయాలని కోరినట్లు సర్పంచ్ కుమ్ర భీమ్రావు పేర్కొన్నారు. సర్పంచ్ ఇచ్చిన తీర్మాన పత్రాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను భర్తీ చేసే విధంగా కృషి చేస్తామని తెలిపినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు లింగమ్మ,సంధ్యారాణి,హజీరా, పాల్గొన్నారు.