శ్రీ మహాత్మ బసవేశ్వర 893వ జయంతోత్సవం….

శ్రీ మహాత్మ బసవేశ్వర 893వ జయంతోత్సవం….
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కలెక్టర్ కార్యాలయంలో శ్రీ మహాత్మ బసవేశ్వర 893 వ జయంతోత్సవం వేడుకలో బసవేశ్వరుని చిత్రపటానికి జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు మాట్లాడుతూ 12వ శతాబ్దంలో జన్మించాడని బసవన్న బసవుడు అని, విశ్వగురు అని పిలుస్తారని సమాజంలో కుల వ్యవస్థను, వర్ణబేదాలను, లింగ వివక్షతను, సామూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది లింగాయత్ ధర్మం స్థాపించారన్నారు. కర్ణాటకలోని భాగేవాడే ఇతని జన్మస్థలం 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించాడని ప్రత్యేకంగా ఐదు రూపాయల నాణెంపై బసవేశ్వరుని చిత్రీకరించారని గొప్ప మహానుభావుడు బసవేశ్వరుడు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్ , టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, డీసీసీ కార్యదర్శి శ్రీనివాసులు, సర్పంచ్ లు, స్థానిక కౌన్సిలర్స్, జిల్లా గౌరవ అధ్యక్షుడు జెమిని సురేష్, జిల్లా ప్రెసిడెంట్ గిరిజ శంకర్, సెక్రెటరీ రాజేష్, మమ్మాయిపల్లి రాజు, మహదేవన్పేట రవిశంకర్, రాజేష్ వీరశైవ లింగాయత్ సభ్యులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు..
