ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న అడ్డ‌గింత‌

ఆమ్ ఆద్మీ కార్య‌క‌ర్త‌ల నిర‌స‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు పీఎం న‌రేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వ‌చ్చిన ఆయనకు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శిప్ర‌తాప్ శుక్లా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఘనస్వాగతం పలికారు. మోదీ రాక సంద‌ర్భంగా బేగంపేట విమానాశ్రయం ఎదుట ఆమ్‌ ఆద్మీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు ఆమ్ ఆద్మీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో ఆమ్‌ఆద్మీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.