Minister | మార్నింగ్ వాక్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి

Minister | మార్నింగ్ వాక్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి
- క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రజలను అడిగి
- సమస్యలు తెలుసుకున్న మంత్రి
Minister | క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ 3, 4, 17, 18, 19 వార్డులలో మార్నింగ్ వాక్ లో భాగంగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలను విని అక్కడికక్కడే సింగరేణి, మున్సిపల్, విద్యుత్ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులను పరిష్కరించాలని అదేశించారు.
చాలావరకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తయ్యాయని పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరేణి పట్టా భూముల విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
RK 4, అబ్రహం నగర్ లలో త్వరలో ప్రారంభం కాబోయే ఆర్ కే పి ఓ సి పి ఫేస్ 2 పనుల వలన దుమ్ము, దూళి ఇళ్లల్లో చేరి జనానికి ఇబ్బంది కలుగుతుందని ప్రజలు కోరగా, దానికి మంత్రి స్పందిస్తూ డస్ట్ లెవెల్స్ మానిటరింగ్ చేసి, తదుపరి కార్యాచరణలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మందమర్రి జీఎంను ఆదేశించారు.
వర్షాకాలంలో ఫ్లడ్ వాటర్ వల్ల వార్డులలోని లోతట్టు ప్రాంతాలు నీటమునగడం, ఇళ్లల్లోకి నీరు చేరడం, కల్వర్టు, నాలాలలో చెత్త పేరుకుపోవడం, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుపోగా మున్సిపల్ అధికారులకు వర్షాకాలంలో ప్రత్యేక కార్యాచరణగా కేవలం నాలాలు క్లీనింగ్ చేయించి, ఎక్కడైతే అవసరమో.. అక్కడ సీసీ డ్రైనేజ్ ని, కల్వర్ట్ లను ముందుగానే నిర్మించుకుని సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఈ మార్నింగ్ వాక్ లో మందమరి జిఎం, రాధాకృష్ణ, తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజు, విద్యుత్ శాఖ AD, బెల్లంపల్లి ఏసిపి , రవికుమార్ ,డిసిసి అధ్యక్షులు రఘునాథ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, నక్క శ్రీనివాస్, వార్డు ఇంచార్జిలు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
