Shuttle Competition | ఇది శుభ పరిణామం..
Shuttle Competition | ఇది శుభ పరిణామం..
Shuttle Competition, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : సంక్రాంతి సెలవుల్లో యువత షటిల్ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనటం శుభ పరిణామం అని గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో వెంకట్రామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి షటిల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. గ్రామీణ యువజన వికాస సమితి, గాంధీ క్షేత్రం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను వెంకట్రామ్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి 32 జట్లు పోటీలకు విచ్చేయగా ఉత్సాహంగా పోటీలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, గాంధీ క్షేత్రం కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, జిల్లా కర్రసాము అసోసియేషన్ చైర్మన్ సింహాద్రి పవన్, ఉపాధ్యక్షులు కొండవీటి పాండురంగారావు, పిఎసిఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, యర్రంశెట్టి సుబ్బారావు, జనసేన కోడూరు టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, కూటమి నాయకులు గుడివాక శివరావు, బచ్చు శ్రీహరి, యలవర్తి ఆది, కాగిత రామారావు, బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, రేపల్లె రవీంద్ర, వెంకటేశ్వరమ్మ, పులిగడ్డ బాలు శ్రీనివాస్, డేగల రాఘవ, కమ్మిలి సాయి భార్గవ, గరికపాటి శ్రీను, వ్యాయామ ఉపాధ్యాయులు గరికపాటి మారుతీ, బడే వెంకటేశ్వరరావు, తోట నవీన్, ఎం.ఉదయ్, దోవా శేషగిరి, గోవర్ధన్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

