Vehicles | హైవేపై ఫుల్ ట్రాఫిక్‌

Vehicles | హైవేపై ఫుల్ ట్రాఫిక్‌

  • ఒంగోలు-కత్తిపూడి రహదారిపై వాహనాల రద్దీ
  • సంక్రాంతికి ఏపీకి త‌ర‌లివ‌స్తున్న ప్ర‌జ‌లు

Vehicles | పెడన, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారులు(National Highways) వాహనాలతో పోటెత్తుతున్నాయి. తెలంగాణ, బెంగళూరు ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ఒంగోలు-కత్తిపూడి రహదారిపై తీవ్ర రద్దీ నెలకొంది.

విజయవాడ నుంచి మచిలీపట్నం, పెడన మీదుగా స్వగ్రామాలకు వెళ్లేవారు ఈ మార్గాన్ని ఎంచుకోవడంతో వాహనాలు(Vehicles) భారీగా చేరుతున్నాయి. పండుగకు మరో రెండు రోజులు ఉండటంతో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది.