Venezuela Crisis  అమెరికా ఆయిల్​ కాలనీ Andhra Prabha Analysis

Venezuela Crisis  అమెరికా ఆయిల్​ కాలనీ Andhra Prabha Analysis

 పూర్తి పెత్తనం అమెరికాదే

వెనుజులా ఇక వలస రాజ్యం

ఆదాయం.. వ్యయం బాధ్యత లేదు

అంతర్జాతీయ సమాజం ఆగ్రహం

ఖండనలతో ఐక్యరాజ్యసమితి సరి

Venezuela Crisis

( ఆంధ్రప్రభ, ఎనాలిసిస్​ డెస్క్) ​

ప్రపంచంలో సుసంపన్న వెనిజులా రాజ్యం.. ఇక వలస రాజ్యంగా అవతరించింది. అమెరికాకు దాసోహమైంది. తమను తాము పాలించుకునే హక్కును వెనిజులా ప్రజలు కోల్పోయారు. ఇప్పటికే  తగిన మార్పులు వచ్చే వరకు మేమే వెనిజులాను నడిపిస్తాం (పాలిస్తాం)  అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు.   ఈ నియంత్రణను “అనిశ్చిత కాలం” (Indefinitely) వరకు అమెరికా కొనసాగించే అవకాశం ఉంది. అంటే.. తనకు తాను వెపిజులా విడిచి పెట్టే వరకూ.. ఆ దేశం అమెరికా ఆధీనంలోనే ఉంటుంది.  వెనిజులా చమురు అమ్మకాలతో  వచ్చే ఆదాయం అమెరికా నియంత్రణలోని  బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుంది. ఆ నిధులను ఎలా ఖర్చు చేయాలనేది కూడా అమెరికానే నిర్ణయిస్తుంది.

Venezuela Crisis

Venezuela Crisis  :  అమెరికాకు సాహో

 ప్రతిపక్ష నేతలను వెనిజులా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ ఈ మార్పు ప్రాంతీయ స్థిరత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. అమెరికా సైనిక చర్యలో నికోలస్ మదురో దొరికిన  తర్వాత, ఆయన డిప్యూటీ  డెల్సీ రోడ్రిగ్జ్ (Delcy Rodríguez) తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఆమెకు లభించింది.

Venezuela Crisis

Venezuela Crisis  : ప్రతిపక్ష నేతల విడుదల

వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం “శాంతి స్థాపన”లో భాగంగా భారీ సంఖ్యలో (Significant Number) రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం  తొమ్మిది మంది (9) ప్రముఖులు విడుదలైనట్లు మానవ హక్కుల సంఘం ( Foro Penal) ధృవీకరించింది. వీరిలో   మాజీ అధ్యక్ష అభ్యర్థి ఎన్రిక్ మార్క్వెజ్ (Enrique Marquez), విపక్ష నేత బియాగియో పిలియెరి (Biagio Pilieri),   ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త రోసియో సాన్ మిగ్యుల్ (Rocio San Miguel) ఉన్నారు.   5గురు స్పానిష్ పౌరులు,  10 మంది అమెరికన్లను కూడా విడుదల చేశారు.అమెరికా డిమాండు  మేరకే  ఈ నేతలను  విడుదల చేశారని  ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ప్రతిగా వెనిజులాపై తలపెట్టిన “రెండవ విడత దాడులను” ఆయన రద్దు చేశారు.

Venezuela Crisis  :  అమెరికా కంపెనీలు క్యూ

Venezuela Crisis

 వెనిజులా సుమారు 30 నుంచి  50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగించడానికి అంగీకరించింది.  అమెరికా చమురు కంపెనీలు క్యూకట్టాయి. షెవ్రాన్​  (Chevron) ఎగ్జామొబిల్​ ( ExxonMobil) వెనిజులాలో సుమారు $100 బిలియన్ల పెట్టుబడి పెట్టేలా ట్రంప్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చమురు రంగంలో అమెరికాతో మాత్రమే భాగస్వామ్యం వహించాలని, చైనా, రష్యా, ఇరాన్ వంటి దేశాలతో సంబంధాలు తెంచుకోవాలని అమెరికా షరతు విధించింది.  వెనిజులాలో ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు ఆ దేశం  సంపదపై నియంత్రణ సాధించే దిశగా అమెరికా వేగంగా పావులు కదుపుతోంది.

Venezuela Crisis

Venezuela Crisis  : రష్యా, చైనాకు షాక్​

ట్రంప్ ప్రభుత్వం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌కు స్పష్టమైన షరతులు విధించారు. వెనిజులా తన చమురు రంగం నుండి చైనా, రష్యా, ఇరాన్,  క్యూబాలను పూర్తిగా  వెలివేయాలని అమెరికా డిమాండ్ చేసింది.  చమురు ఉత్పత్తి, అమ్మకాల్లో కేవలం అమెరికా కంపెనీలతో (ExxonMobil, Chevron వంటివి) మాత్రమే భాగస్వామ్యం వహించాలని శాసించింది.\

Venezuela Crisis

ఈ స్థితిలో..  వెనిజులా నుండి చైనాకు వెళ్లే చమురు రవాణా ఇప్పటికే ఆగిపోయింది. చైనా చెల్లించాల్సిన బకాయిల విషయంలో ట్రంప్ బీజింగ్‌తో చర్చలు జరిపే అవకాశం ఉన్నా, వెనిజులా భూభాగంపై మాత్రం చైనా  ప్రభావం ఉండకూడదని అమెరికా పట్టుబడుతోంది. వెనిజులాలో జనవరి 2026 నాటికి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, శాంతి స్థాపన కోసం అటు తాత్కాలిక ప్రభుత్వం, ఇటు అంతర్జాతీయ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ (Delcy Rodríguez) అనుసరిస్తున్న వ్యూహాలు   శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి.   

 Venezuela Crisis  : శాంతి స్థాపన సాధ్యమా?

Venezuela Crisis

 దేశంలో  ఉద్రిక్తతలను తగ్గించడానికి,  ప్రతిపక్షాలతో సయోధ్య కోసం “శాంతి చర్య”లో భాగంగా వందలాది మంది రాజకీయ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. అమెరికాకు చమురు సరఫరా చేసేందుకు అంగీకరించడం ద్వారా మరింత సైనిక దాడి జరగకుండా ప్రభుత్వం అడ్డుకోగలిగింది. దీనివల్ల యుద్ధ వాతావరణం తగ్గి, ఆర్థిక చర్చలకు అవకాశం ఏర్పడింది.

Venezuela Crisis

అంతర్జాతీయ సంస్థల ద్వారా ఆహారం, మందులను దేశంలోకి అనుమతించడం ద్వారా ప్రజలలో ఉన్న అసహనాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది.  ఈ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే, ఒకవైపు దేశీయ సవాళ్లను ఎదుర్కొంటూనే, మరోవైపు అంతర్జాతీయ సంబంధాలను సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల మద్దతు పొందడం,  దేశంలో పూర్తిస్థాయి రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం కష్టతరంగా మారింది. “అమెరికా చెప్పినట్టే చేస్తాం” అని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అంగీకరించినట్లు ట్రంప్ చెబుతున్నారు,  ఆమె మాత్రం వెనిజులా సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ప్రకటిస్తున్నారు.

Venezuela Crisis  : ఆ దేశాల్లో ఆగ్రహం

Venezuela Crisis

 చైనా, రష్యా, ఇరాన్ , క్యూబా దేశాలు అమెరికా సైనిక దాడిని  “అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన”గా   “గూండాయిజం” (Bullying) గా వర్ణించాయి. బ్రెజిల్, మెక్సికో ,  స్పెయిన్ వంటి దేశాలు కూడా ఈ ఏకపక్ష చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి.  ఐక్యరాజ్యసమితి నిపుణులు ఈ సైనిక చర్యను,  మదురో కిడ్నాప్‌ను ఖండించారు, ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.   అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ వంటి నేతలు మదురో అరెస్టును  “స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం”గా కొనియాడారు.  మొత్తంగా చెప్పాలంటే, వెనిజులా ప్రస్తుతం అమెరికా ఆర్థిక,  సైనిక పర్యవేక్షణలోకి వెళ్ళిపోయింది. వెనిజులా తన పాత మిత్రదేశాలు రష్యా, చైనాలను వదులుకుని అమెరికాకు అనుకూలమైన “చమురు భాగస్వామి”గా మారే దిశగా అడుగులు వేస్తోంది.

Venezuela Crisis  : వెనిజులా భావోద్వేగం

Venezuela Crisis

వెనిజులా ప్రజలు ప్రస్తుతం రెండు  వర్గాలుగా విడిపోయారు . గత 10 ఏళ్లుగా మదురో పాలనలో ఆహారం, మందులు లేక, ద్రవ్యోల్బణంతో అల్లాడిపోయిన సాధారణ ప్రజలు ఈ మార్పును ఆహ్వానిస్తున్నారు.  అమెరికా రాకతో ఆర్థిక వ్యవస్థకు  ఉపశమనం (Relief) లభిస్తుందని, మళ్ళీ నిత్యావసరాలు దొరుకుతాయని కొందరు ఆశిస్తున్నారు.  మరికొందరు తమ దేశంపై అమెరికా సైనిక దాడిని, తమ వనరులపై పరాయి దేశం పెత్తనాన్ని అవమానంగా భావిస్తున్నారు. “మేము స్వేచ్ఛను కోరుకున్నాం కానీ, మరొక దేశానికి బానిసలుగా మారాలని కాదు” అనే గళం వినిపిస్తోంది. 

వెనిజులాలో ప్రతిపక్షాలు ప్రస్తుతం ఇబ్బందికర స్థితిలో ఉన్నాయి . మరియా కొరినా మచాడో వంటి నేతలు మదురో నియంతృత్వాన్ని అంతం చేయడాన్ని స్వాగతించారు. ట్రంప్ తన వ్యాపార ధోరణితో (చమురు కోసం) వెనిజులాను ఒక కార్పొరేట్ సంస్థలా చూడటాన్ని   పూర్తిస్థాయిలో సమర్థించలేకపోతున్నారు.  ప్రతిపక్షాలు కోరుకుంటున్నది స్వతంత్ర ఎన్నికలు,  ప్రజాస్వామ్యం. కానీ ప్రస్తుతం అక్కడ అమెరికా కనుసన్నల్లో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. సార్వభౌమత్వాన్ని పూర్తిగా అమెరికాకు అప్పగించడంపై విపక్షాల్లో కూడా అంతర్గత చర్చలు, ఆందోళనలు మొదలయ్యాయి.

Venezuela Crisis

 Venezuela Crisis  : నయా వలస వాదం

“బానిసత్వం” అనేది పెద్ద పదం, కానీ “ఆర్థిక పరతంత్రత” పెరిగే అవకాశాలు వెనిజులాలో  స్పష్టంగా కనిపిస్తున్నాయి.  వెనిజులా చమురు నిక్షేపాలపై అమెరికా కంపెనీలదే గుత్తాధిపత్యం ఉంటే, ఆ దేశ ఆదాయం అమెరికా చేతుల్లోనే ఉంటుంది. దీనివల్ల వెనిజులా తన సొంత నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరుతుంది.  దీనిని 21వ శతాబ్దపు సరికొత్త వలసవాదంగా వలసవాదం (Neo -Colonialism) గా విశ్లేషకులు  అభివర్ణిస్తున్నారు.

Venezuela Crisis

ప్రజలు నేరుగా బానిసలు కాకపోయినా, తమ  దేశ సంపద, భవిష్యత్తును మరొక దేశం నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతోంది.ప్రస్తుతానికి వెనిజులా ప్రజలు ఆకలి నుండి బయటపడతారేమో కానీ, తమ దేశంపై పూర్తి హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. ట్రంప్ తన “America First” విధానంలో భాగంగా వెనిజులాను ఒక భాగస్వామిలా కంటే, ఒక ఆస్తిలా (Asset) చూస్తున్నారనేది స్పష్టమవుతోంది.

Leave a Reply