Highway | ఫుల్ జామ్‌..!

Highway | ఫుల్ జామ్‌..!

  • హైదరాబాద్​-విజయవాడ జాతీయ ర‌హ‌దారి కిట‌కిట‌
  • క్యూ క‌ట్టిన వాహ‌నాలు
  • సంక్రాంతికి సొంతూళ్ల‌కు పయ‌న‌మైన న‌గ‌ర‌వాసులు

వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ ; సంక్రాంతి సెలవులు రావ‌డంతో హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీగా మారింది. పండ‌గ‌కు ఊళ్ల‌కు వెళ్లే వారి వాహ‌నాలు హైవేపై బారులుదీరాయి. శుక్రవారం సాయంత్రం నుంచే ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ రోజు నుంచి అది మ‌రింత ఎక్కువ‌గా ఉంది.
హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారిపై వాహ‌నాలు క్యూ క‌ట్టాయి.

Highway

మరోవైపు జాతీయ రహదారిపై అండర్​పాస్​ వంతెన, సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరం నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్​తో ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలకు అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు.

Highway | కిటకిటలాడుతున్న బస్టాండ్లు :

Highway

శుక్రవారం నుంచి ఎంజీబీఎస్, కూకట్​పల్లి, దిల్​సుఖ్​​నగర్, ఎల్బీ నగర్ బస్టాండ్లు ప్ర‌యానికుల‌తో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారితో బస్సులు నిండిపోయాయి. రద్దీకి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నా సరిపోవడం లేదు. ఇలా ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక ప్రైవేట్​ వెహికల్స్​ను ఆశ్రయించాల్సి వస్తోంది. వారు ఇదే అదునుగా టికెట్​ ధరలను డబుల్​ చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

CLICK HERE TO READ అంబర్‌పేట్ ఎస్ఐ అరెస్ట్

CLICK HERE TO READ MORE

Leave a Reply