Andhra prabha | ప్రజల పక్షాన నిలిచే పత్రిక ఆంధ్రప్రభ

Andhra prabha | ప్రజల పక్షాన నిలిచే పత్రిక ఆంధ్రప్రభ

  • ఏఎంసి వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి

Andhra prabha | తాడ్వాయి, ఆంధ్రప్రభ : ప్రజల కోసం,ప్రజల పక్షాన ,ప్రజల సమస్యలను వెలికితీసే ఏకైక పత్రిక ఆంధ్రప్రభ అని ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజి రెడ్డి అన్నారు. శుక్రవారం తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో 2026 ఆంధ్ర ప్రభ వార్షిక క్యాలెండర్ ను ప్రజా ప్రతినిధులు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న ఏకైక పత్రిక అని గుర్తు చేశారు.

సర్పంచ్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక ఆంధ్రప్రభ అని అన్నారు. ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజల సమస్యలను తీరుస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న పత్రిక అని తెలిపారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఎన్నో మాహనీయమైన కథనాలు,ప్రభుత్వ అభివృద్ధి విధానాలను ప్రచురిస్తూ అభివృద్ధి కోసం ప్రజల తరఫున నిలబడుతున్న పత్రిక అని గుర్తు చేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఇంకా ఎన్నో మంచి కథనాలు తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మేడం బాలయ్య, ఉపాధ్యక్షుడు గైని సాయిలు, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంబల మైపాల్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాసుల ఆంజనేయులు, బిజెపి నాయకుడు పత్తి రమేష్, ఉప సర్పంచ్ మల్లేష్, వార్డు సభ్యులు మూగ రాజు, దేమే కృష్ణమూర్తి ,పులి స్వప్న, గోగుల సవిత, పులి మహేశ్వరి, ప్రవీణ్ కుమార్, భూపతి, బాలరాజు పాల్గొన్నారు.

Leave a Reply