DROK | గణతంత్రానికి ఘ‌న ఏర్పాట్లు

DROK | గణతంత్రానికి ఘ‌న ఏర్పాట్లు

  • డీఆర్ఓకె మోహన్ కుమార్ ఆదేశాలు

DROK | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఆయా శాఖల జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, జనవరి 26వ తేదీన ఉదయం 9 గంటలకు నగరంలోని పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు ఓవరాల్ ఇంచార్జిగా వ్యవహరిస్తారని చెప్పారు. వేడుకలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ప‌రేడ్ కార్యక్రమానికి ఎన్సీసీ, స్కౌట్స్ విద్యార్థులను సమన్వయం చేయాలని, ప్రొటోకాల్ ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలని ఆర్డీవోకు సూచించారు. జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేయాలని ఆదేశించారు. వేడుకల సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ కార్యాలయ ప్రతినిధికి సూచించారు. అగ్నిమాపక భద్రత చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను తెలియజేసేలా శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వేడుకలకు హాజరయ్యే వారికి స్నాక్స్, తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రధాన వేదిక వద్ద స్టేజ్ డెకరేషన్, సిట్టింగ్ ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ప్రగతిపై సందేశాన్ని సిద్ధం చేయాలని, వివిధ శాఖల ద్వారా ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అందించే ప్రశంసా పత్రాల వివరాలను వెంటనే కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.

ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేపట్టాలని, సాంస్కృతిక కార్యక్రమాలను డీఈఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 19వ తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు డీఆర్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ సాయినాథ్, ఆర్డీవో శ్రీనివాసులు, ఫైర్ ఆఫీసర్ పెద్దిరెడ్డి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి సుధాకర్ రావు, సెరికల్చర్ జేడీ పద్మావతి, డీఈఓ రాజేంద్రప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ పీడీ వెంకటరమణ, ఏవో వాసుదేవన్, అర్బన్ ఎమ్మార్వో కులశేఖర్ తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply