Celebrations | ముందస్తు సంక్రాంతి సంబరాలు

Celebrations | ముందస్తు సంక్రాంతి సంబరాలు

  • సంబరాలు చేసుకుంటున్న విజయసాయి పాఠశాల ఉపాధ్యాయులు

Celebrations | కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాల విజయసాయి పాఠశాలలోని ముందస్తు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయి పాఠశాల ప్రిన్సిపల్ సప్న మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికీ సంక్రాంతి పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులు సంక్రాంతి సంబరాలను సంతోషంగా జరుపుకోవాలని, గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించారు. అదేవిధంగా భోగభాగ్యాలు కలగాలని, ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. అనంతరం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భోగి మంటలు రంగురంగుల ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply