Orkonda | మొక్కలను సంరక్షించాలి

Orkonda | మొక్కలను సంరక్షించాలి
- రాచాలపల్లి సర్పంచ్ మహేష్
Orkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ : నాణ్యమైన విత్తనాలను నాటి మొక్కలను సంరక్షించాలని రాచాలపల్లి సర్పంచ్ మాడుగుల మహేష్ అన్నారు. మండల పరిధిలోని రాచాలపల్లి గ్రామంలో నర్సరీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నాణ్యమైన విత్తనాలను నాటి పెరిగిన మొక్కలను సంరక్షించాలని, ప్రజా అవసరాల నిమిత్తం పూల, పండ్ల మొక్కలను నాటాలని, హరితహారంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కల పెంపుదల చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటస్వామి గౌడ్, వార్డు సభ్యులు, నాయకులు సుదర్శన్ రెడ్డి, గోపి నాయక్, సురేష్, పంచాయతీ కార్యదర్శి ఇందిర, ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
