welfare schemes | రెండేళ్లలో వేయికోట్లతో అభివృద్ధి

welfare schemes | రెండేళ్లలో వేయికోట్లతో అభివృద్ధి

  • విద్య, వైద్యానికి పెద్దపీట…

welfare schemes | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, గత రెండేళ్లలో దాదాపు వేయి కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

పట్టణంలో ఎండబెట్ల వద్ద హై లెవల్ బ్రిడ్జి(High Level Bridge)కి 10కోట్లు, సీసీ రోడ్లకు రూ. 20కోట్ల, బస్టాండుకు 12కోట్లు, సిర్సవాడ బ్రిడ్జికి 20కోట్లు, యంగ్ ఇండియా స్కూల్ కు 200కోట్లు, వైద్య కళాశాల 200 కోట్లు, అసంపూర్తిగా ఉన్న మార్కండేయ రిజర్వాయర్ కు 25కోట్లు మంజూరు చేయించి ప్రారంభించామన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలు పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తానన్నారు.

welfare schemes |

అలాగే స్ర్తీశక్తి భవన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలభవనం, అలాగే ప్రజల కోరిక మేరకు ఆర్టీఏ కార్యాలయం మార్చామన్నారు. ముస్లింల షాదీఖానా కోసం 3కోట్లకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ‌ఇంజనీరింగ్,‌ పాలిటెక్నిక్ కళాశాల(Polytechnic College)లు త్వరలో మంజూరు అవుతాయన్నారు. తెల్కపల్లికి డిగ్రీ కళాశాల మంజూరు అయ్యిందని అన్నారు. అన్ని మండలాల్లో అభివృద్ధి జరిగేలా చూస్తామన్నారు.

వివిధ అభివృద్ధి పనులకు 650 కోట్లు నిధులు(Rs. 650 crores funds) రావడం జరిగింది అని, పృభత్వ పథకంలు కలిపి ఈ రెండేళ్లలో నియోజకవర్గంలో దాదాపు వేయి కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని,‌ నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 55కోట్లతో సీసీ రోడ్లు, 25 కోట్ల తో డ్రైనేజీ పనులు చేపట్టామని అన్నారు. పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందన్నారు.

అలాగే ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం, పింఛన్లులాంటి ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాల(welfare schemes)తో పేద ప్రజలకు నాగర్‌కర్నూల్ నుండి తరలిపోయిన బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విలేకరల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, ఆర్ టి ఏ మెంబెర్ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వినోద్, కోటయ్య నిజాం శ్రీనివాసలు తదితరులు పాల్చొన్నారు.

Leave a Reply