school | “రాముడి దురాశ కథకు చోటు”

school | “రాముడి దురాశ కథకు చోటు”
school | చిట్యాల, ఆంధ్రప్రభ : బాలచెలిమి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్(Children’s Education) అకాడమీ, హైదరాబాద్ వారు నిర్వహించిన జాతీయ కథల పోటీలలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని బల్గురి హారిక రాసిన ‘రాముడి దురాశ ‘ కథకు చోటు దక్కింది.
ఈ పోటీలో పాల్గొని కథలు రాసిన గుండ్రాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(school)లో చదువుతున్న జి. లహరి, ఎన్. శాన్విశ్రీ, ఎస్. తేజశ్రీ, ఏ. శేషు, ఏ.అక్షిత, ఎం.డి.మెహైక్, ఆర్. దివ్య, ఆర్. సృజన, ఎస్. కె. నఫీస, ఎం.డి మదియా, ఆర్. హని, డి. మేరి, ఆర్. బబిత లను అభినందిస్తూ బాలచెలిమి చైర్మన్ మణికొండ వేద కుమార్, కన్వీనర్ గరిపల్లి అశోక్ ప్రశంసా పత్రాలు పంపారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోగికార్ రమాదేవి విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన గైడ్ టీచర్ తెలుగు ఉపాధ్యాయురాలు డా. ఉప్పల పద్మను అభినందిస్తూ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మసరం శ్రీనివాస్, ఆండాలు, వెంకట్రావు, షరీఫ్, రాంరెడ్డి, వెంకటరమణ, వెంకటేశ్వర్లు జూనియర్ అసిస్టెంట్లు నరసింహ, ప్రణయ తదితరులు పాల్గొన్నారు.
