Ramannapeta | మెగా క్రీడోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Ramannapeta | మెగా క్రీడోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Ramannapeta | రామన్నపేట, ఆంధ్రప్రభ : బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ మెగా క్రీడోత్సవం ( ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం) సన్నాహక మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి నకిరేకల్ బీజేపీ పార్టీ ఇంచార్జ్ నకిరేకంటి మొగులయ్య హాజరై మెగా క్రీడోత్సవాన్ని రామన్నపేటలో వివిధ గ్రామాల యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామీణ క్రీడాకారులని ప్రోత్సహిస్తూ మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, పార్లమెంట్ స్థాయిలో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, కోకో లాంటి ఆటలు పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్నారు.

ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న అన్ని గ్రామాల యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు డోగుపర్తి సుభాష్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి అక్కినపల్లి సైదులు, మండల ప్రధాన కార్యదర్శి జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, మండల ఉపాధ్యక్షుడు కంభంపాటి శివరంజన్, కార్యదర్శులు బందెల సంజీవ, రేపాక లింగస్వామి, బీజేపీ నాయకులు రాపోలు రమేష్, సింగు శంకర్ రెడ్డి, బొడ్డు పెళ్లి సైదులు, మేడి పరశురాం, ఐలాపురం అశోక్, గురజాల నవీన్ రెడ్డి, గురజాల నిరంజన్ రెడ్డి, దాకోజీ నాగరాజు, కంచి రమేష్, ఎర్రబోయిన వెంకన్న, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply