Electricity | విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట…

Electricity | విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట…
Electricity | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఫోర్ట్ వరంగల్ పరిధిలో ఇవాళ 35వ డివిజన్ బ్యాంకు కాలనీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యుత్ వరంగల్ డివిజన్ డీఈ శెంకేసి మల్లికార్జున్ మాట్లాడుతూ… ప్రజలకు ఉన్న విద్యుత్(electricity) సమస్యల పరిష్కారానికి ప్రజాబాట కార్యక్రమం ను వినియోగించుకోవాలన్నారు.
ముఖ్యంగా లో ఓల్టేజ్ సమస్య, లూస్ వైర్స్, విద్యుత్ సరఫరాకు అంతరాయం, బిల్లులు ఎక్కువ, తక్కువ ఉన్న సమస్యలు, ట్రాన్స్ ఫారంలో చెట్లు తొలగించుట, కరెంటు వైర్ల(power wires)పై ఉన్న చెట్లను తొలగించుట, తక్షణమే పరిష్కారం సమస్యలు, ఇండ్లపై ఉన్న 11కేవీ వైర్ల సమస్య, రోడ్ కి అడ్డంగా ఉన్న స్థంబాల సమస్యలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పరష్కరించబడుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ పాల్గొని విద్యుత్ సమస్యల పరిష్కారంనకు ప్రజాబాట నిర్వహించడం చాలా మంచి కార్యక్రమమన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ విద్యుత్ ఏడీ కిషోర్ కుమార్, ఏఈ రామక్రిష్ణ, రాజయ్య, లైన్ ఇన్స్పెక్టర్ సాంబరాజు లైన్ మెన్ శ్రీధర్, నాగరాజు, విద్యుత్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
