kodavalur | ఒంటరి మహిళ దారుణ హత్య

kodavalur | ఒంటరి మహిళ దారుణ హత్య

  • క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలన
  • సంఘటన స్థలాన్ని సంద‌ర్శించిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్

kodavalur | కొడవలూరు, ఆంధ్రప్రభ : ఒంటరిగా నిద్రిస్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు నుదుటిపై తీవ్రంగా గాయపరిచి హత్య చేసిన ఘటన కొడవలూరు మండలం కొత్త వంగల్లులో చోటుచేసుకుంది. కొత్త వంగల్లు బస్టాండ్ దగ్గరగా తన సొంత ఇంట్లో పేట కామేశ్వరమ్మ(65) నివసిస్తూ ఉండేది. భర్త చనిపోవడం, కుమారుడు నెల్లూరులో కాపురం ఉండడంతో ఈమె ఒక్కరే గ్రామంలో నివసిస్తుంది. ఆదివారం పొద్దుబోయే వరకు చుట్టుపక్కల వారితో మాట్లాడడం జరిగింది. ఇంటి బయట గేటు మూసి ఉండడంతో ఇంటి వద్ద లేదని చుట్టుపక్కల వారు అనుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు గేటు తీయ‌క‌పోవ‌డంతో చుటుపక్కల వారు గేటు తీసి లోపలికి వెళ్లడం జరిగింది. బయట వరండాలో దోమతెరలో నిద్రిస్తున్న మహిళను చూసి, హత్యకు గురైంద‌ని గుర్తించి సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం డాగ్స్ స్క్వాడ్ బృందాలతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కోటిరెడ్డి మాట్లాడుతూ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వచ్చి పరిశీలించడం జరిగిందని, అన్ని కోణాల్లో విచారిస్తున్నామ‌ని, నిందితులను త్వరలో పట్టుకోవడం జరుగుతుందని అన్నారు. సంఘటన స్థలాన్ని రోల్డ్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, సీఐలు సుధాకర్ రెడ్డి, సుబ్బారావు, ఎస్సైలు కోటిరెడ్డి, నరేష్ ఇతర ఎస్సైలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Leave a Reply